హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో స్పీడ్ స్కేటింగ్ 3000మీటర్ల రిలేలో అటు మహిళల టీమ్(కార్తీక, హీరల్,ఆరతీ), ఇటు పురుషుల టీమ్(ఆర్యన్ పాల్, ఆనంద్ కుమార్, సిద్దాంత్, విక్రమ్) సత్తా చాటాయి. రెండు టీమ్‌లు కాంస్యం గెలుచుకున్నాయి. మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రాంరాజ్ 55.42 సెకన్లతో దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష జాతీయ రికార్డును సమం చేసింది. దీంతో ఈవెంట్‌లో ఫైనల్ రౌండ్‌కు విత్యా అర్హత సాధించింది.
ఇక టేబుల్ టెన్నిస్ లో కూడా భారత్ కు కాంస్య పతకం లభించింది.. మహిళల డబుల్స్ విభాగంలో అయినా,సుతిరత ముఖర్జీ జోడి బ్రోంజ్ మెడల్ ను సాధించారు.. కాగా ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 56కు చేరింది. స్వర్ణం-13 రజతం- 21 కాంస్యం-22.