ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్ కొనసాగుతోంది. బంగారు పతకాలను భారత్ ఈజీగా గెలిచేస్తోంది. ఇవాళ ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జ్యోతి, ఓజాస్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని సాధించారు. దీంతో ఇండియా మెడల్స్ సంఖ్య 71కి చేరుకున్నది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది 16వ స్వర్ణం కావడం విశేషం.
జ్యోతి సురేఖా వెన్నం, ఓజాస్ దియోతలే.. చరిత్రాత్మక ఆట తీరను కనబరిచారు. మిక్స్‌డ్ ఆర్చరీ ఈవెంట్‌లో ఫెవరేట్‌గా ఉన్న దక్షిణకొరియా ఆటగాళ్లను ఓడించారు. ఫైనల్లో 159-158 స్కోరుతో ఇండియన్ జట్టు గోల్డ్ మెడల్‌ను ఎగురేసుకుపోయింది. . కొరియాకు చెందిన సో చయివాన్, జూ జహివూన్ జంటను జ్యోతి టీమ్ మట్టికరిపించింది.
ఇక 35 కిలో మీటర్ల మిక్సెడ్ వాక్ విభాగంలో భారత జోడీ మంజు రాణి, రాంబాబు లు కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.
- Advertisement -