చైనా వేదికగా సెప్టెంబర్ 23,2023 నుండి అక్టోబర్ 8 వరకు ఏసియన్ గేమ్స్ నిర్వహించనున్నట్లు ఒలంపిక్ ఏసియా కౌన్సిల్ ప్రకటన చేసింది. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా రద్దవుతూ వచ్చిన ఏసియన్ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. చైనా వేదికగా హాంగోజోలో నిర్వహింనగరం షాంఘై నగరానికి 200 కి.మీ.ల దూరంలో ఉంది. సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఏసియన్ గేమ్స్ నిర్వహించే అన్ని వేదికలను ఏప్రిల్‌కే సిద్ధం చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్రీడలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది.
ఏసియన్ గేమ్స్‌లో 10వేల మంది అథ్లెట్స్ పాల్గొనే అవకాశమున్నట్లు చెప్పారు. కోవిడ్ కారణంగా కేవలం అంతర్జాతీయ క్రీడలే ఏసియా గేమ్స్ ఇదివరకే రద్దయినట్లు ఏసియన్ ఒలంపిక్ అసోసియేషన్ తెలిపింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన కారణంగా 2022 సెప్టెంబర్‌లో జరగాల్సిన గేమ్స్ 2023 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. క్రీడల నిర్వహణపై ఏసియన్ గేమ్స్ అసోసియేషన్ పలు అధ్యయనాలు జరిపిన అనంతరం ఈ ప్రకటన విడుదల చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.