Sunday, November 17, 2024

Asian Games – రోయింగ్ లో భార‌త్ కు మూడు ప‌త‌కాలు..

చైనాలో జ‌రుగుతున్న ఆసియ‌న్ గేమ్స్ లో భార‌త్ రోయింగ్ క్రీడాకారులు నేడు మూడు ప‌త‌కాల‌ను సాధించారు.. వాటిలో రెండు సిల్వర్ మెడ‌ల్స్, ఒక కాంస్యం ఉన్నాయి.. రోయింగ్ కాక్స్ డ్ ఎయిట్ విభాగంలొ భారత జ‌ట్టుకు ర‌జితం ల‌భించింది..

పురుషుల లైట్‌వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌ ఫైనల్‌లో భార‌త రోవర్లు అర్జున్‌ లాల్‌, అర్వింద్‌ కూడా రజత పతకాన్ని దక్కించుకున్నారు.

రోయింగ్‌ మెన్స్‌ పెయిర్‌ ఈవెంట్‌లో భార‌త్ కు చెందిన బాబు యాదవ్ , లేఖ్‌ రామ్‌తో కూడిన జట్టు కాంస్య పతకం గెలుపొందింది. రోయింగ్‌ మెన్స్‌ పెయిర్‌ ఈవెంట్‌లో హాంగ్‌కాంగ్‌ జట్టు 6.44 నిమిషాల్లో నిర్ధేశిత గమ్యాన్ని చేరుకుని మొదటి స్థానంలో (బంగారు పతకం) నిలువగా, 6.48 నిమిషాలతో ఉబ్జెకిస్థాన్‌ (రజతం), 6.50 నిమిషాలతో భారత జంట మూడో స్థానం (కాంస్యం)లో నిలిచారు.

కాగా, నేటి ఉద‌యం మ‌హిళ రైఫిల్స్ విభాగంలో భార‌త జ‌ట్టు ర‌జ‌తంలో శుభారంభం చేసింది.. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ మూడు సిల్వ‌ర్, ఒక కాంస్య ప‌త‌కం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement