Friday, September 20, 2024

Surfing | సర్ఫింగ్‌ టీమ్‌ సంచలనం..

భారత సర్ఫర్లు సంచలనం సృష్టించారు. తొలిసారి ఆసియా గేమ్స్‌ బెర్త్‌ను కైవసం చేసుకుని కొత్త చరిత్ర లిఖించారు. మాల్దివ్స్‌ వేదికగా జరిగిన ఆసియా సర్ఫింగ్‌ చాంపియన్‌షిప్స్‌-2024లో భారత సర్పర్లు మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటుకున్నారు. దాంతో తమ ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్న భారత పురుషుల, మహిళల జట్లు 2026 ఏషియన్‌ గేమ్స్‌కు అర్హత సాధించాయి.

కాగా, ఇక్కడ జరిగిన అండర్‌-18 విభాగంలో కిశోర్‌ గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హీట్‌-2లో మూడో స్థానంలో నిలిచి జట్టుకు అవసరమైన కీలక పాయింట్లు సాధించాడు. దాంతో భారత్‌ రెండేళ్ల తర్వాత జపాన్‌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో చోటు సాధించింది. ఆటగాళ్ల ప్రదర్శనపై భారత సర్ఫింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అరుణ్‌ వాసు హర్షం వ్యక్తం చేశారు. వారిని అభినందించారు. సర్ఫింగ్‌లో భారత్‌కు ఇదొక్క గొప్ప దినమని ఆయన అన్నారు. అలాగే స్పోర్ట్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (సాట్స్‌) కూడా సోషల్‌ మీడియా వేదికగా భారత సర్ఫర్లను అభినిందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement