ఆసియా టీ20 కప్ టోర్నమెంట్ శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తిగా కాగా, శనివారంనాడు జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వార్షిక సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు షెడ్యూల్ కూడా విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియాకప్ టోర్నీ ఆతిథ్యమివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా, ఏసీసీ అధ్యక్షుడు జయ్ షాకు సమాచారం ఇచ్చినట్లు, శ్రీలంక క్రికెట్ కౌన్సిల్ సెక్రటరీ మోహన్ డి సిల్వా వెల్లడించారు. అయితే శ్రీలంకలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆసియాకప్ టోర్నమెంట్ నిర్వహణ సాధ్యమేనా? అన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఐస్‌లాండ్ ప్రభుత్వం కూడా టోర్నీ నిర్వహణకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే.. టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ముందే టీమిండియాకు మరో సవాలు ఎదురుకానుంది. ఆసియా కప్ టోర్నమెంట్ కోసం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం… ఆగస్టు 28న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుందని సమాచారం. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమిపాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్‌తోపాటు యూఏఈ, సింగపూర్, కువైట్, హాంగ్‌కాంగ్ దేశాల్లో క్వాలిఫై అయిన జట్టు ఆసియా కప్‌లో తలపడనుంది. ఆసియా కప్ పూర్తి కాగానే… కేవలం నెల వ్యవధిలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.