ఆసియా కప్ 2024 లో పాకిస్థాన్ జట్టు బోణీ కొట్టింది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల జట్టు విజయం సాధించింది. దంబుల్లా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టుపై 9 వికెట్లతో ఘన విజయం సాధించి.. టోర్నీలో ఖాతా తెరిచింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ మహిళల జట్టు… పాకిస్థాన్ ధాటికి 108 పరుగులకే పరిమితమైంది. నేపాల్ బ్యాటర్లలో కబితా జోషి (31 నాటౌట్), సీతా రాణా మగర్ (26), పూజా మహతో (25) రాణించారు. ఆ తరువాత, స్వల్ప టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ చెలరేగింది. పాక్ ఓపెనర్లు గుల్ ఫిరోజా (57), మునీబ్ అలీ (46 నాటౌట్) విజృంభించారు. దీంతో నేపాల్ నిర్దేశించిన లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోపే ఛేదించి గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో రెండు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.