Saturday, September 7, 2024

Asia Cup | చిత్తుగా ఓడిన థాయిలాండ్.. బంగ్లా తొలి విజ‌యం

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2024లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ మ‌హిళ‌ల జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ లో థాయిలాండ్ ను చిత్తుగా ఓడించి…. టోర్నీలో తొలి విజ‌యం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో థాయ్‌లాండ్‌ను కట్టడి చేసిన బంగ్లాదేశ్….. ఆ తరువాత బ్యాట్‌తోనూ అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన థాయ్ లాండ్ బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి 96 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప ఛేదనలో బంగ్లా ఓపెనర్ ముర్షిదా ఖాతున్ (50) చెలరేగిపోయింది. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు థాయ్‌లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని 17.3 ఛేదించి 7 వికెట్ల తో విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement