కాండీ (పల్లెకెలె): ఆసియాకప్‌లో భాగం గా ఈరోజు జరిగే తమ రెండో మ్యాచ్‌తో భారత జట్టు పసికూన నేపాల్‌తో ఢీ కొనేం దు కు సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకి స్తాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్ వర్షా ర్పణం అయిన విషయం తెలిసిందే. ఇప్పు డు తాజాగా నేపాల్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు కూడా వానగండం ఉందని ఇక్క డి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో భార త అభిమానులు తీవ్ర నిరాశకు గురవు తున్నారు. ఇప్పుడు నేపాల్ మ్యాచ్‌లోనూ 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా జరగడం కష్టమనిపిస్తోంది. ఇక పాయింట్ల విషయానికి వస్తే 2 మ్యాచ్‌లు ఆడిన పాక్ 3 పాయింట్లతో గ్రూప్-ఏ నుంచి సూపర్-4కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించిన పాకిస్తాన్.. భారత్‌తో మ్యాచ్ రద్దవడంతో మరోపాయింట్ దక్కించుకుంది. దీంతో మొత్తంగా మూడు పాయింట్లతో పాక్ సూపర్-4కు అర్హత సాధించింది. ఇక తొలి మ్యాచ్ రద్దవడంతో ఒక్క పాయింట్ దక్కించుకున్న భారత్ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై గెలిస్తే మొత్తం గా మూడు పాయింట్లతో సూపర్-4కు చేరుకుంటుంది. అలాగే మ్యాచ్ రద్దయితే మరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు మొత్తం 2పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది.
టాప్ ఆర్డర్ ఈసారైనా..
పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఓపెనర్ శుభ్‌మాన్ గిల్, శ్రేయస్ అయ్యార్ ఇలా అందరూ చెత్తగా బ్యాటింగ్ చేసి నిరాశ పరిచారు. పాక్ పేస్‌ను ఎదుర్కోనేందుకు నానాతంటలు పట్టారు. ముఖ్యంగా షహీన్ అఫ్రిదిని ఎదుర్కోవడంలో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. కోహ్లీ, రోహిత్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు క్లీన్ బౌల్డ్‌గా ఔటవడం అందరిని ఆశ్చర్య పరిచింది. ఒక్క నెలలో ప్రపంచకప్ ప్రారంభమవబోతుంది. ఆ మెగా టోర్నీకి టీమిండియా పూర్తిగా సన్నద్దమైందా లేదా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దాయాదుల పోరులో కోహ్లీ, రోహిత్‌లు పాత ఫామ్‌ను కనబర్చలేక పోయారు. కీలక మ్యాచ్‌లో వీరిద్దరు విఫలమవడం ఆందోళన కల్గించే అంశమే. మరోవైపు ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన శుభ్‌మాన్ గిల్ సైతం వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నాడు. గత విండీస్ వన్డే సిరీస్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక సెలెక్టర్లు ఇతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా వారి ఆశలను కూడా ఆవిరి చేస్తూ చెత్త ప్రదర్శనలు ఇస్తున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో జిడ్డుగా ఆడుతూ 32 బంతులు ఎదుర్కొని కేవలం 10 పరుగులకే వెనుదిరిగాడు. ఇక గాయంతో చాలాకాలం జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్ పునరాగమనంలో సత్తా చాటుకుం టాడనుకుంటే.. కేవలం రెండు షాట్లకే పరిమితమయ్యాడు. అనవసరంగా చెత్తా షాట్ ఆడి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత ఇషాన్ కిశన్, హార్దిక్ పాండ్యలు టీమిండియాను ఆదుకోవడంతో గౌరప్ర దమైన స్కోరును చేయగలిగింది. ఓవరాల్ గా పాక్‌తో మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన నిరాశ జనకంగా ఉంది. పాక్ మ్యాచ్‌లో జరి గిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుం టారని ఆశిద్దాం. ప్రపంచకప్‌కు ముందు వంద శాతం ఆటతో గాడిలో పడాలని కోరుకుందాం.
ఇషాన్‌పై భారీ అంచనాలు..
ప్రపంచకప్‌కు ముందు అద్భుత బ్యాటింగ్ కనబర్చిన ఇషాన్ కిశన్పై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటివరకు ఆప్షన్ ప్లేయర్‌గా ఉన్న ఇషాన్ గత మ్యాచ్‌లో (82) చిరస్మ రణీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ జట్టులో ఇతను ఉండాలని అందరూ కోరుకొంటున్నారు. కీలక సమయంలో జట్టుకు ఆదుకోవడంతో పాటు హార్దిక్ పాండ్యతో కలిసి బాధ్యతగా ఆడి అందరి ప్రశంసలు పొందాడు. చివరి ఆరు మ్యాచుల్లో (50, 210, 52, 55, 77, 82) ఇషాన్ పరుగులు. బంగ్లాపై డబుల్ శతకంతో విద్వంసం సృష్టించాడు. తర్వాత విండీస్ సిరీస్‌లో వరుసగా మూడు అర్ధ శతకాలు సాధించాడు. ఇప్పుడు ఆపద్బాంధువుగా పాక్ మ్యాచ్‌లో టీమిండియాను గట్టెక్కించాడు. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం అద్భుతమైన బ్యాటింగ్‌తో పాక్ బౌలర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. టాప్ ఆర్డర్ విఫలమైనా మేమున్నామని గర్వంగా చెప్పుకునేలా చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మరోసారి నిరాశ పరిచారు. ఎప్పటిలాగే వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. పోరాడేందుకు ప్రయత్నించలేదు. బుమ్రా మినహా అందరూ చేతులెత్తేశారు. ఇతర జట్ల లాగా టీమిండియా లోయర్ ఆర్డర్ కూడా బ్యాటింగ్‌లో మెరుగుపడాలి.
నేపాల్‌కు చావోరేవో..
తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన పసికూన నేపాల్‌కు టీమిండియాతో మ్యాచ్ చావోరేవోగా మారింది. పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. తక్కువ స్కోరుకే కీలకమైన ఓపెన ర్లను ఆవుట్ చేసి మ్యాచ్‌లో ఆసక్తి నెలకొల్పారు. కానీ ఆ తర్వాత పాక్ సారథి బాబ ర్ ఆజమ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేశాడు. ముం దు ఇతనికి జతగా ఉన్న రిజ్వాన్ ఆవుటైనా.. తర్వాత ఇఫ్తికార్ చెలరేగడంతో నేపా ల్ బౌలర్లు చేతులెత్తేశారు. తర్వాత బ్యాటింగ్‌లోనూ నేపాల్ విఫలమైంది.