Saturday, November 30, 2024

Asia Cup – భార‌త్ ముందు భారీ టార్గెట్ ….

దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా భార‌త్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సాద్ బేగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొద‌ట బ్యాటింగ్ చేసిన దాయాది జ‌ట్టుకు ఓపెన‌ర్లు ఉస్మాన్ ఖాన్ (94 బంతుల్లో 60 పరుగులు), షాజైబ్ ఖాన్ (147 బంతుల్లో 159 పరుగులు) ఏకంగా 160 పరుగుల ఓపెనింగ్ భాగ‌స్వామ్యం అందించ‌డం విశేషం.

అయితే, ఉస్మాన్ ఖాన్ వికెట్ కోల్పోయిన‌ తర్వాత పాక్ వ‌రుస విరామాల్లో వికెట్లు పారేసుకుంది. కానీ, త్వ‌ర‌గా వికెట్లు కోల్పోయినప్పటికీ మ‌రో ఎండ్‌లో షాజైబ్ క్రీజులో పాతుకుపోయి జట్టు భారీ స్కోర్ చేయ‌డం కీల‌కంగా వ్య‌హ‌రించాడు. భారీ సెంచ‌రీ (159)తో పాక్‌ను ఆదుకున్నాడు.

చివ‌రికి పాకిస్థాన్ 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 281 ర‌న్స్‌ చేసింది. టీమిండియాకు 282 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. భార‌త బౌల‌ర్ల‌లో సమర్థ్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు తీయ‌గా గుహ‌, కిర‌ణ్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. 282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ త‌గిలింది.. ఓపెన‌ర్లు ఇద్ద‌రు వెంట వెంట‌నే ఔటయ్యారు.. ప్ర‌స్తుతం టీమ్ ఇండియా రెండు వికెట్ల న‌ష్టానికి 35 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement