ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై బంపర్ విక్టరీ కొట్టింది. మొదట విరాట్ కోహ్లీ(122 నాటౌట్ : 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కేఎల్ రాహుల్(111 నాటౌట్ : 106 బంతుల్లో12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో విజృంభించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(56), వుభ్‌మన్ గిల్ (58) అర్ధ సెంచరీలు కొట్టడంతో భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 356 రన్స్ కొట్టింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో పాక్ భరతం పట్టాడు. దాంతో, ఇండియా 228 రన్స్ తేడాతో గెలుపొందింది..
357 పరుగుల భారీ ఛేదనలో పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా ప్రత్యర్థికి ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఐదో ఓవర్‌లో ఓపెనర్ ఇమాముల్ హక్(9)ను బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం(10)ను బౌల్డ్ చేశాడు
. వర్షం తగ్గాక ఆట మొదలైన తొలి ఓవర్‌లోనే మహమ్మద్ రిజ్వాన్(2)ను శార్దూల్ ఠాకూర్ పెవిలియన్ పంపాడు. దాంతో, 47 రన్స్ వద్ద పాక్ మూడో వికెట్ పడింది. అక్కడితో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ మొదలైంది.కుల్దీప్ కమాల్ఆచితూచి ఆడుతున్న ఓపెనర్ ఫఖర్ జమాన్(27)ను ఈ చైనామన్ స్పిన్నర్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో అఘా సల్మాన్(23)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. అంతేకాదు షాదాబ్ ఖాన్(6), డేంజరస్ ఇఫ్తికార్ అహ్మద్(23)లను ఔట్ చేసి పాక్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఫహీం అష్రఫ్ (4) కుల్దీప్ బౌల్డ్ చేయడంతో పాక్ 8వ వికెట్ పడింది. నసీం షా, హ్యారిస్ రవుఫ్ గాయపడడంతో అంపైర్లు భారత్‌ను విజేతగా ప్రకటించారు. విరాట్ కోహ్లీ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది .