Tuesday, November 26, 2024

History | 140 ఏళ్ల క్రికెట్ చరిత్ర‌లో అశ్విన్ స‌రికొత్త రికార్డు..

ధ‌ర్మ‌శాల టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్ 64 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కాగా, ఈ టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో దుమ్మురేపాడు. అశ్విన్ కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కాగా, 100వ టెస్టులో ఐదు వికెట్లు తీసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లేకు ఈ ఘనత దక్కింది. 2005లో శ్రీలంకపై కుంబ్లే 89 పరుగులు చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.

దీంతో పాటు అనిల్ కుంబ్లే పేరిట ఉన్న మరో రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన భారత ఆటగాడిగా నిలిచాడు. కుంబ్లే కెరీర్‌లో 35 సార్లు 5 వికెట్లు తీశాడు. తాజా ప్రదర్శనతో అశ్విన్ 36 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement