రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఓవరాల్‌గా తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌తో తన 98వ టెస్ట్ మ్మాచ్ ఆడుతున్న అశ్విన్ ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ(15)ని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
టెస్టు క్రికెట్‌లో 500 పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు వీరే..
ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్) – 696*
అనిల్ కుంబ్లే (భారత్) – 619
స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్) – 519
నాథన్ లయన్ (ఆస్ట్రేలియా) – 517*
రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 500*