Friday, October 18, 2024

WR Chess Masters విజేతగా అర్జున్‌ ఎరిగైసి..

తెలంగాణ యువ గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఎరిగైసి తన ఖాతాలో మరో టైటిల్‌ వేసుకున్నాడు. డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌ విజేతగా అర్జున్‌ నిలిచాడు. లండన్‌ వేదికగా జరిగిన డబ్ల్యూఆర్‌ చెస్‌ మాస్టర్స్‌ కప్‌ క్లాసికల్‌ గేమ్‌ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అర్జున్‌ వరల్డ్‌ బ్లిట్జ్‌ ఛాంపియన్‌ మాగ్జిమె వచీయర్‌పై విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకున్నాడు.

ఉత్కంఠ భరీతంగా సాగిన ఈ పోరులో అర్జున్‌-మాగ్జిమె తొలి రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకున్నారు. అనంతరం జరిగిన కీలకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం అర్జున్‌ ప్రత్యర్థిని చిత్తు చేసి విజేతగా అవతరించాడు. దీంతో పాటు రూ.18 లక్షల ప్రైజ్‌ మనీని కూడా సొంతం చేసుకున్నాడు. కాగా, తొలి రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న అర్జున్‌ 2,800 రేటింగ్‌ పాయింట్స్‌ మాత్రం సాధించలేక పోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement