Monday, September 9, 2024

Copa cup | అమెరికా ఫుట్ బాల్ ఫైనల్స్‌లో అర్జెంటీనా – కొలంబియా..

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో కొలంబియా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కొలంబియా 1-0తో ఉరుగ్వేను చిత్తు చేసింది. గురువారం జరిగిన ఈ రెండో సెమీఫైనల్లో కొలంబియా మిడ్ ఫీల్డర్ జెఫెర్సన్ లెర్మా ఏకైక గోల్ చేసి కొలంబియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. 39వ నిమిషంలో అతను గోల్ సాధించాడు. సోమవారం అర్జెంటీనా వర్సెస్ కొలంబియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అర్జెంటీనా విజయం..

ఇక నిన్న జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా 2-0 తేడాతో కెనడాను ఓడించింది. కెనడాతో మ్యాచ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 22వ నిమిషంలో జులియన్‌ అల్వారెజ్‌ గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచింది. అక్కడి నుంచి అర్జెంటీనా మరింత దూకుడుగా ఆడింది. డ్రిబ్లింగ్‌ నైపుణ్యాలతో దిగ్గజ ఆటగాడు మెస్సి అలరించాడు. రెండో అర్ధభాగంలో గోల్‌ పోస్టుకు సమీపంలో నుంచే బంతిని లోపలికి పంపిన మెస్సి జట్టును విజయపథంలో నడిపించాడు. అర్జెంటీనా తరపున గత 25 మ్యాచ్‌ల్లో మెస్సి 28 గోల్స్‌ చేశాడు. కోపా అమెరికాలో అతనికిది 14వ గోల్‌. అర్జెంటీనాకు ఇది వరుసగా పదో విజయం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement