Wednesday, December 4, 2024

Archery – విజ‌య‌వాడ‌లో ప్రారంభ‌మైన రాష్ట్ర స్థాయి అర్చ‌రీ పోటీలు

విజయవాడ – ఆంధ్రప్రభ, – మాచవరం శాతవాహ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగిన 20 వ రాష్ట్రస్థాయి కాంపౌండ్ ఆర్చరీ పోటీలు ప్రారంభ‌మ‌య్యాయి.. ఈ పోటీల‌ను లాంచ‌నంగా ఆయన లాంఛనంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ప్రారంభించారు.ముందుగా అంతర్జాతీయ కోచ్ చెరుకూరి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు.

అనంత‌రం దోనేపూడి శంక‌ర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్చరీ క్రీడను ఉనికిలోకి తీసుకువచ్చి వందలాది పథకాలను రాష్ట్రానికి అందించిన గురువు చెరుకూరి సత్యనారాయణకి ద్రోణాచార్య అవార్డ్ ఇచ్చి గౌరవించాలని కోరారు. క్రీడలలో రాజకీయాలు చేయటం మానుకోవాలని, క్రీడలను క్రీడలుగా గుర్తించాలని అన్నారు. దేశానికి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే క్రీడలకు ప్రాముఖ్యత కల్పించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన ఆర్చరీ క్రీడను అభివృద్ధి చేసేందుకు, ఎంతోమంది క్రీడాకారులను వెలికి తీసుకువచ్చిన వోల్గా ఆర్చరీ అకాడమీకి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.

- Advertisement -

అనంతరం వోల్గా ఆర్చరీ అకాడమీ వ్య‌వ‌స్థాప‌కుడు, శిక్ష‌కుడు చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల మూడు నాలుగు ఐదు తేదీలలో జరుగుతున్న ఈ పోటీలలో విజయం సాధించినవారు 15 నుండి 20వ తేదీ వరకు జంషెడ్ పూర్ లో జరుగుతున్న జాతీయ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ పోటీలలో టాప్ 8 సాధించిన టీములను ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్లో జరుగుతున్న నేషనల్ గేమ్స్ లో పాల్గొంటారని తెలిపారు.

కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారి గొట్టిపాటి ప్రేమ్ కుమార్, జాతీయ ఆర్చరీ జడ్జి బొమ్మ దేవర శ్రవణ్ కుమార్, టెక్నికల్ అఫీషియల్ బెవర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement