Wednesday, September 18, 2024

Archery – ప్రీ క్వార్ట‌ర్స్ లో దీపికా కుమారి..

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త ఆర్చ‌ర్ దీపికా కుమారి వ్య‌క్తిగ‌త విభాగంలో 16వ రౌండ్‌కు అర్హ‌త సాధించింది. బుధ‌వారం జ‌రిగిన పోటీల్లో రీనా ప‌ర్నాట్(ఎస్తోనియా), క్వింటీ రోఫెన్(నెద‌ర్లాండ్స్)ల‌ను ఓడించిన దీపిక ముందంజ వేసింది. 64వ స్టేజ్ రౌండ్‌లో ప‌ర్నాట్‌ను 6-5తో పైచేయి సాధించిన భార‌త ఆర్చ‌ర్ 32వ రౌండ్‌లో రోఫెన్‌పై 6-2తో విజ‌యం సాధించింది. క్వార్ట‌ర్స్ బెర్తును నిర్ణ‌యించే త‌ర్వాతి పోరులో దీపిక జ‌ర్మ‌నీ ఆర్చ‌ర్ మిచెల్లె క్రొప్పెన్ తో త‌ల‌ప‌డ‌నుంది. వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో ఉన్న మిచెల్లెకు దీపిక చెక్ పెడితే ప‌త‌క వేట‌లో క్వార్ట‌ర్స్ లో ప్ర‌వేశిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement