Thursday, November 7, 2024

AP – క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీస్తాం – శాప్ చైర్మన్

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో)గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రాధికార సంస్థ(శాప్)చైర్మన్ అనిమిని రవి నాయుడు తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

విజయవాడ మహానాడు రోడ్డులోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీని ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ స్వాగతించి శాలువాలతో సత్కరించారు.

- Advertisement -

అనంతరం ఆర్చరీ క్రీడాకారులు శాప్ ఛైర్మన్ ని కలిసి పరిచయం చేసుకున్నారు. ఆర్చరీ క్రీడలో తాము గెలుచుకున్న మెడల్స్ గురించి వివరించారు. ఆర్చరీ అకాడమీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడుతూ అకాడమీలో క్రీడాకారులందరూ నేషనల్స్ కు సెలెక్ట్ అయ్యి పోటీలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అకాడమీకి కావాల్సిన వసతులు గురించి శాప్ ఛైర్మన్ కి వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు .

దీనిపై శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ అకాడమీకి కావాల్సిన వసతులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముందు క్రీడాకారుల తీసుకుంటున్న శిక్షణను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement