Nitish kumar | భారత జట్టులోకి ఏపీ కుర్రాడు… మరింత ఎత్తుకు ఎదగాల‌న్న జ‌గ‌న్

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్న నితీశ్‌కుమార్‌రెడ్డి భారత టీ-20 జట్టులోకి ఎంపికయ్యాడు. కాగా, భారత టీ-20 జట్టుకు ఆంధ్రా నుంచి ఎంపికైన తొలి ఆటగాడు నితీశ్‌కుమార్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.

ఆల్ రౌండర్ గా రాణిస్తున్న నితీష్.. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వే పర్యటనలో నితీష్ మంచి ప్రతిభ కనబరచాలని, కెరీర్ లో మరింత ఎదగాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే ఐపీఎల్‌లో స్థానం సంపాదించి నితీశ్‌కుమార్‌రెడ్డి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాగా, ⁠జూలై 2024లో జరగబోయే జింబాబ్వే పర్యటన కోసం నితీశ్‌ భారత టీ-20 జట్టుకు ఎంపికయ్యారు.

Exit mobile version