ఆస్ట్రేలియా ఓపెన్ డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ షెడ్యూల్ ప్రకారం సోమవారం టోర్నీలో తోటి సెర్బియన్ మియోమిర్తో ఆడాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు జకోవిచ్ మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా బోర్డర్ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేవని వీసాను రద్దు చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. దీంతో జకోవిచ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన ఫెడరల్ కోర్టు జకోవిచ్‌కు తొలుత అనుకూలంగా తీర్పునిచ్చింది. వీసాను పునరుద్ధరించాలని, డిటెన్షన్ సెంటర్ నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈక్రమంలో జకోవిచ్ ప్రాక్టీస్ ప్రారంభించగా కొవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరించినందును అతడి వీసాను మరోసారి ఆస్ట్రేలియా ప్రభుతం రద్దు చేసింది.
ఈ సందర్భంగా ప్రభుత న్యాయవాది స్టీఫెన్ లాయిడ్ మాట్లాడుతూ జకోవిచ్ కరోనా మహమ్మారిని నిరోధించే టీకాను గత రెండేళ్లుగా వేయించుకోలేదని, పదేపదే భద్రతా చర్యలను విస్మరించారని తెలిపాడు. జకో ప్రస్తుతం టీకా వ్యతిరేక వర్గాలుగా ఐకాన్‌గా మారాడని లాయిడ్ పేర్కొన్నాడు. కాగా మెల్బోర్న్ విమానాశ్రయంలోని బోర్డర్ ఫోర్స్ అధికారులు జకోవీసాను రద్దు చేసినప్పుడు విధానపరమైన తప్పులు చేశారని అందుకే అతడికి అనుకూలంగా తీర్పు వచ్చిందని లోయర్ సర్క్యూట్ కోర్టు న్యాయమూర్తి తెెలిపారు. ఇదిలా ఉండగా జకోవిచ్ 20గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లతో సమంగా ఉన్నాడు. వీరిలో ఫెదరర్ గాయంతో ముందే వైదొలిగాడు. ఆదివారం జకోవిచ్ ఆస్ట్రేలియాను వీడాడు. టెన్నిస్ లెజెండ్ త్రయం ముగ్గురిలో మిగిలిన స్పెయిన్ బుల్ నాదల్ సీజన్ ఓపెనింగ్ గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిస్తే అత్యధిక టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.