గుజరాత్‌లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలలో జాతీయ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు పతకాల జోరు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల విద్యార్థిని అగసార నందిని అథ్లెటిక్స్ 100మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది. 13.38 సెకన్లలో నందిని ఈ ఘనత సాధించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజ్ 12.79 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం పతకం చేజిక్కించుకోగా, నందిని 13.38 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 13.42 సెకన్లతో జార్ఖండ్ అథ్లెట్ సప్నకుమారి కాంస్యం అందుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement