Friday, November 22, 2024

Mumbai Indians : ముంబైకి మ‌రో షాక్… క్వేనా మఫాకా దూరం

మూలిగే నక్కపై తాటి పండు పడ్డమంటే ఇదేనేమో.. అసలే ముంబై ఇండియన్స్ జట్టు చచ్చీ చెడీ ఒక మ్యాచ్ గెలిచిందో లేదో, అప్పుడే సౌతాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ 17 ఏళ్ల క్వేనా మఫాకా స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో ముంబై జట్టులో బౌలింగ్ విభాగం వీక్ అయిందని అంటున్నారు.

- Advertisement -

ఎందుకీ కుర్రాడు వెళ్లిపోతున్నాడంటే, తను పదో తరగతి చదువుతున్నాడు. పరీక్షలు జరగనుండటంతో వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఐపీఎల్ షెడ్యూల్ లో చాలా మార్పులు వచ్చాయి. దీంతో క్వేనా మఫాకా ముందుగా రావల్సి వచ్చింది.

అయితే ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీకి చెప్పాడంట, కనీసం 4 మ్యాచ్ లైనా ఆడమని చెప్పడంతో తను పరీక్షల ముందు వచ్చాడు. కానీ దురద్రష్టవశాత్తూ మూడు మ్యాచ్ లు ఓడిపోయారు. నాలుగో మ్యాచ్ గెలవగానే తను వెళ్లిపోతున్నాడు. నిజానికి శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక కూడా తొలుత గాయపడి ముంబై జట్టులో చేరలేదు. దీంతో తన ప్లేసులో క్వేనా మఫాకా వచ్చాడు. ఇప్పుడు తను కూడా వెళ్లి పోతున్నాడు. మరోవైపున కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ముంబై ఇండియన్స్ కి ఈ ఏడాది మూడినట్టే అంటున్నారు.
ఇంక జస్ప్రీత్ బుమ్రాపైనే భారం అంతా పడేలా ఉంది. ఇంక ముంబై ఇండియన్స్ లో చెప్పుకోదగ్గ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, కొయెట్జీ, పియూష్ చావ్లా ఉన్నారు. మరి వీళ్లతో హార్దిక్ బండెలా నడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement