ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డె వాన్ కాన్వే గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూర మయ్యాడు. న్యూజిలాండ్ బ్యాటర్ కాన్వే ఇటీవల స్వ దేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అతడి బొటన వేలికి గాయమవడంతో సర్జ రీ చేయాల్సి వచ్చింది. దాంతో కాన్వే ఐపీఎల్-2024 ఆరంభపు మ్యాచ్‌లకు దూరమైన అతడు టోర్నీ మధ్యలో జట్టుతో కలుస్తాడని సీఎస్‌కే యా జమన్యం భావించింది.
కానీ కాన్వే పూర్తిగా కోలుకోక పోవడంతో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం వెల్లడించింది. ఇక తదుపరి మ్యాచ్‌లకు కాన్వే స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ రిచర్డ్ గ్లీసన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎస్‌కే తమ ఆధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రూ. 50 లక్షలతో గ్లాసన్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ జట్టు రిజర్వ్ ఆట గాడైన రిచర్డ్ ఆరు మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో సీఎస్‌కెకు బౌలర్ల సమస్య వెంటాడుతోంది.