టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో మైలురాయిని చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగుతున్న టెస్టు మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన యార్కర్ కింగ్ బుమ్రా.. 227 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ ఘనత సాధించిన ఆరో భారత పేసర్‌గా, ఓవరాల్‌గా పదవ బౌలర్‌గా బుమ్రా చరిత్ర సృష్టించాడు.
కాగా, భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే మూడు ఫార్మాట్లలో 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. చెపాక్ టెస్టులో సెంచరీ చేసిన అశ్విన్ 744 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన హీరోలు వీరే… !
- అనిల్ కుంబ్లే – 953 వికెట్లు, 499 ఇన్నింగ్స్‌లు.
- అశ్విన్ – 744 వికెట్లు, 369 ఇన్నింగ్స్‌లు.
- హర్భజన్ సింగ్ – 707 వికెట్లు, 442 ఇన్నింగ్స్‌లు.
- కపిల్ దేవ్ – 687 వికెట్లు, 448 ఇన్నింగ్స్‌లు.
- జహీర్ ఖాన్ – 597 వికెట్లు, 373 ఇన్నింగ్స్‌లు.
- రవీంద్ర జడేజా – 570 వికెట్లు, 397 ఇన్నింగ్స్‌లు.
- జవగల్ శ్రీనాథ్ – 551 వికెట్లు, 348 ఇన్నింగ్స్‌లు.
- మహహ్మద్ షమీ – 448 వికెట్లు, 188 మ్యాచ్‌లు.
- ఇషాంత్ శర్మ – 434 వికెట్లు, 280 ఇన్నింగ్స్‌లు.
- జస్ప్రీత్ బుమ్రా – 401 వికెట్లు, 227 ఇన్నింగ్స్‌లు.