Tuesday, November 26, 2024

రంజీట్రోఫీ చరిత్రలో మరో మైలురాయి.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు..

ముంబై రంజీ ట్రోఫీ చరిత్రలోనే ముంబై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో క్వార్టర్‌ ఫై నల్లో 725 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. తద్వారా సెమీఫైైెనల్స్‌కు చేరుకుంది. 795 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఉత్తరాఖండ్‌….ముంబై బౌలర్ల ధాటికి 69 పరుగులకే పరిమితమైపోయింది. దీంతో చరిత్రలోనే భారీ విజయం సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 92 ఏళ్ల క్రితం 1929లో షఫీీల్డ్‌ షీల్డ్‌ క్రికెట్లో న్యూసౌత్‌ వేల్స్‌పై క్వీన్స్‌లాండ్‌ 685 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇప్పటిదాకా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ లో ఓ రికార్డుగా ఉంది.

అయితే తాజాగా ముంబై ఈ రికార్డును అధిగమించింది. అందరినీ అబ్బురపరిచింది. ఉత్తరాఖండ్‌ ఇన్నింగ్స్‌లో శివమ్‌ ఖురానా 25 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లలో ధవల్‌ కుల్‌కర్ణి, షామ్స్‌ ములాని, తనుష్‌ కొటెన్‌ తలా మూడు వికెట్లు తీశారు. మోహత్‌ అవస్థి ఒక వికెట్‌ను పడగొట్టాడు. అంతకుముందు ముంబై రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. యశస్వి జైస్వాల్‌ 103, పృధ్వీషా 72 పరుగులు తీశారు ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 114 పరుగులకే ఔటయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement