Friday, September 20, 2024

Football | హైదరాబాద్​లో మ‌రో అంతర్జాతీయ స్టేడియం..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్​: అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా బీసీసీఐ స‌హ‌కారంతో ముచ్చెర్లలో ఏకంగా వంద ఏక‌రాల్లో క్రికెట్ స్టేడియం నిర్మించ‌నుంది.. ల‌క్ష మంది ఈ స్టేడియంలో మ్యాచ్‌ల‌ను వీక్షించే అవ‌కాశం ఉంది.

ఇక తాజాగా.. ఫుట్ బాల్ స్టేడియాన్ని కూడా నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనికోసం గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ రంగంలోకి దిగింది.. గ్రేటర్‌లో భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్‌బాల్ స్టేడియాన్ని నిర్మించేందుకు అడుగులు సాగుతున్నాయి.

అనువైన స్థలం కోసం.. పలు ప్రాంతాల పరిశీలన..

ఐదెకరాల్లో ₹200కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఫుట్‌బాల్‌ కోర్టు కోసం అధికారులు ఎల్బీనగర్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌-తిరుమలగిరి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌-షేక్‌పేట, శేరిలింగంపల్లి-గచ్చిబౌలి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. త్వరలో అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.

- Advertisement -

హైదరాబాద్​కు పునర్​వైభవం

ఒక‌ప్పుడు ఫుట్ బాల్ కు రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ క్ర‌మక్ర‌మంగా ఆ ప్రాభవాన్ని కోల్పోయింది. బెంగాల్, గోవా ఇప్పుడు ఫుట్ బాల్ కు ప్రాణం పోస్తున్నాయి. మ‌ళ్లీ హైద‌రాబాద్ పునర్​ వైభవం కల్పించేందుకు ఫుట్ బాల్ కు ప్రాచుర్యం క‌ల్పించ‌డంతో పాటు మెరిక‌లాంటి క్రీడాకారుల‌ను త‌యారు చేసేందుకు క్రీడా ప్రాధికార సంస్థ సిద్ద‌మ‌వుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement