Sunday, November 3, 2024

Lucknow Supergiants : మ‌యాంక్ నుంచి మ‌రో ఫాస్ట్ డెలివ‌రీ

ఐపీఎల్ – 2024 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు విజయం సాధించింది. యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ చెలరేగిపోవడంతో ఆర్సీబీ బ్యాటర్లు తడబడ్డారు.

- Advertisement -

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్ డికాక్ 56బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 19.4 ఓవర్లకు కేవలం 153 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో జట్టు విజయంలో మయాంక్ యాదవ్ కీలక భూమిక పోషించాడు. నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మయాంక్ నాలుగు ఓవర్లువేసి కేవలం 14 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో మయాంక్ కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై అద్భుత బౌలింగ్ చేశాడు. మయాంక్ తొలి నుంచి నిలకడగా 145kmph కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఒక దశలో మయాంక్ వేసిన బంతి 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది. ఈ ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన బంతి అదేకావటం విశేషం. తాజాగా ఆ రికార్డును తను ఆడిన రెండో మ్యాచ్ ఆర్సీబీపై బద్దలు కొట్టాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన ప్రదర్శన గాలివాటం కాదని మయాంక్ యాదవ్ నిరూపించుకున్నాడు.

మంగళవారం రాత్రి ఆర్సీబీ జట్టుపై నిప్పులు చెరిగే బంతులతో చెలరేగిపోయాడు. మెరుపు వేగతంతో, లైన్అండ్ లెన్త్ లో బంతులు వేసి బెంగళూరు బ్యాటర్లను వణికించాడు. ప్రమాదకర బ్యాటర్లు మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్ ల వికెట్లను మయాంక్ పడగొట్టాడు. ఈ క్రమంలో గత మ్యాచ్ లో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు. గత మ్యాచ్ లో 155.8 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి 2024 సీజన్ లో సరికొత్త రికార్డు నెలకొల్పిన మయాంక్.. ఆర్సీబీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 156.7 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత వేగవంతమైన బంతి వేసింది షాన్ టైట్. అతను వేసిన బంతి 157.7kmph వేగంతో దూసుకెళ్లింది. తాజాగా మయాంక్ వేసిన బంతి 156.7 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement