Tuesday, November 26, 2024

వరల్డ్‌ అథ్లెటిక్స్‌లో నిరాశ పరిచిన అన్నూ రాణి.. ఫైనల్స్‌లో 7వ స్థానంలో భారత అథ్లెట్

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్‌ అన్నూ రాణి పోరాటం ముగిసింది. జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐదు ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి మాత్రమే 60 మీటర్లకు పైగా బరిసెను విసిరింది. మిగిలిన నాలుగుసార్లు ఆమో విఫలమైంది. దీంతో ఆమె ఏడో స్థానంతో నిలిచింది. తొలిసారి 56.18 మీటర్లు వేసిన అన్నూ రాణి, తర్వాత నాలుగు ప్రయత్నాల్లో 61.12, 58.14, 59.98, 58.70 మీటర్ల దూరం విసిరింది.

దీంతో ఆమెకు నిరాశ తప్పలేదు. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ కెల్సీ లీ బార్బర్‌ (ఆస్ట్రేలియా) మరోసారి తన సత్తా చాటింది. ఫైనల్స్‌లో బార్బర్‌ ఏకంగా 66.91 మీటర్ల దూరం బరిసె విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. అమెరికాకు చెందిన కారా వింగర్‌ 64.05 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. ఇక జపాన్‌ త్రోయర్‌ హరుకా కిటగుచి 63.27 మీటర్ల దూరం విసిరి కాంస్యం గెలుచుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement