Tuesday, October 22, 2024

CK Nayudu Under-23 | ఆంధ్రా జట్టు ఆల్‌రౌండ్ షో..

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): మూలపాడు గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియంలోని డీవీఆర్ గ్రౌండ్ లో ఆంధ్రా – మేఘాలయ జట్ల మధ్య మ్యాచ్ సోమవారం రెండో రోజుకు చేరుకుంది. టాస్ గెలిచిన మేఘాలయ జట్టు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో ఆంధ్రా జట్టు 62 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 373 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ సాధించింది. రెండో రోజు ఆంధ్రా జట్టు 66.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 402 పరుగులు చేసింది. జట్టులోని హర్షవర్ధన్ 196 బంతుల్లో (12×4) (7×6)161 పరుగులు చేశారు.

మేఘాలయ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 66.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌట్ అయింది. స్వస్టిక్ 93 బంతుల్లో (4×4) (2×6) 49 పరుగులు, కెవిన్ 36 బంతుల్లో (4×4) (1×6) 33 పరుగులు చేశారు. ఆంధ్రా బౌలర్ వాసు 6 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చారు. ఇస్మాయిల్ 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్ లో మేఘాలయ 16 ఓవర్లలో 23 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. అవినాష్ 39 బంతుల్లో 6 పరుగులు చేశాడు. ఆంధ్రా బౌలర్ ఇస్మాయిల్ రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు, శ్రీకర్ ఒక పరుగు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement