Friday, November 22, 2024

IPL : ఓడిన కెప్టెన్ల కు జరిమానాలో మోత …

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మళ్లీ ఓడిపోయాయి. తమ ప్రత్యర్థుల చేతుల్లో మట్టికరిచాయి. ఈ వరుస ఓటముల తరువాత ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టయింది ఈ రెండు జట్లకూ. ఆదివారం మధ్యాహ్నం కోల్‌కత నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తేడాతో ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

- Advertisement -

తొలుత బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం ఈ టార్గెట్‌ను ఛేదించడానికి చిట్టచివరి వరకూ పోరాడింది ఆర్సీబీ. 20 ఓవర్లల్లో 221 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

రాత్రి జరిగిన మరో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది పంజాబ్ కింగ్స్. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో 142 పరుగులకు ఆలౌట్ అయింది. 21 బంతుల్లో 35 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఒక్కడే టాప్ స్కోరర్. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ టైటాన్స్ కూడా తడబడింది. చివరి ఓవర్ వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లాల్సి వచ్చింది. పైగా ఏడు వికెట్లను కోల్పోయింది కూడా. 19.1 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులతో విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్- 35, సాయి సుదర్శన్- 31, రాహుల్ తెవాతియా- 36 పరుగులతో జట్టును ఆదుకున్నారు.

ఈ రెండు మ్యాచ్‌లల్లో కూడా ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన చోటు చేసుకుంది. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, పంజాబ్ కింగ్స్ సారథి సామ్ కుర్రన్‌కు భారీగా జరిమానా విధించారు. డుప్లెసిస్‌కు 12 లక్షల రూపాయల ఫైన్ పడింది. సామ్ కుర్రన్‌కు చెల్లించే మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు కోత పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement