భారత్, బ్రిటన్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్లో అమిత్ రోహిదాస్‌కు రిఫరీ జోషువా బర్ట్ రెడ్‌కార్డు చూపించిన విషయం తెలిసిందే. ఇక్కడ రిఫరీ జోషువాకు, బాలీవుడ్‌కు ఓ సంబంధం ఉంది. షారుఖ్ ఖాన్ కీలక పాత్రలో వచ్చిన ‘చక్ దే ఇండియా’ సినిమాలో అతడు ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కోచ్‌గా నటించాడు. ఆ సినిమాలో విలన్ అయిన జోషువా.. ఇప్పుడు నిజ జీవితంలో భారత పురుషుల జట్టుకు కూడా విలన్ అయ్యాడు.
ఆటలో భాగంగా స్టిక్ తగలడంతో ఉద్దేశపూర్వకంగానే బ్రిటన్ క్రీడాకారుడిని కొట్టాడంటూ ఏకంగా మ్యాచ్ నుంచి అమిత్ ను బయటకు పంపేశాడు.. అంతేకాకుండా అతడు ఇచ్చిన నివేదికతో అమిత్ రోహిదాస్ ఫై ఒక మ్యాచ్ నిషేధం కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య విధించింది. అయితే జోషువా తీరుపై భారత హాకీ సమాఖ్య తీవ్ర అభ్యంతరం చెప్పడంతో పాటు మిగిలిన మ్యాచ్ లకు ఆయను రిఫరీ విధులకు దూరంగా ఉంచాల్సిందిగా కోరింది.. దీంతో భారత్ తో నేడు జర్మనీతో జరిగే మ్యాచ్ ను జోషువాను తొలగించింది..