సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ జట్టు తరఫున 100 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మిశ్రా తర్వాత సెహ్వాగ్ (86 మ్యాచ్‌లు), శ్రేయస్ అయ్యర్(79), రిషబ్ పంత్(69), షాబాజ్ నదీమ్(69) ఉన్నారు. చెన్నైతో శనివారం జరిగిన మ్యాచ్‌తో అమిత్ మిశ్రా ఈ మార్క్‌ను అందుకున్నాడు.
అటు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మిశ్రా(160 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ టాప్‌లో కొనసాగుతున్నాడు. అలానే ఈ టోర్నీలో అత్యధికంగా మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్ కూడా మిశ్రానే కావడం విశేషం.