Thursday, November 21, 2024

Tokyo olympics: ఈత కొలనులో అమెరిక కొత్త రికార్డు..

టొక్యో ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ అమెరికా ఈతగాళ్లు కొత్త రికార్డు క్రియెట్ చేశారు. ఇప్పటివరకు ఉన్న రికార్డులను తుడిచిపెడుతూ కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశారు. స్టార్ స్విమ్మ‌ర్ కెలెబ్ డ్రెసెల్ నేతృత్వంలోని అమెరికా 4×100 మీట‌ర్ల మిడ్లే రిలే టీమ్ రికార్డు టైమ్‌లో రేసు పూర్తి చేసింది. 3 నిమిషాల 26.78 సెక‌న్ల‌లో పూర్తి చేసి 2009 వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్స్‌లో న‌మోదైన 3:27.17 నిమిషాల రికార్డును బ్రేక్ చేసింది. ఈ రిలేలో బ్రిట‌న్ (3:27.51), ఇట‌లీ (3:29.17) త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొద‌ట్లో అమెరికా స్విమ్మ‌ర్‌ ఆండ్రూ బ్రెస్ట్ర్‌స్ట్రోక్ లెగ్ పూర్త‌య్యే స‌రికి బ్రిట‌న్ కంటే 20 మీట‌ర్ల దూరంలో నిలిచింది. అయితే డ్రెసెల్ బ‌ట‌ర్‌ఫ్లై లెగ్ మొత్తం మార్చేసింది. కాగా కెలెబ్ డ్రెసెల్ రెండు రోజుల క్రితమే తన వ్యక్తిగత స్వర్ణం సాధించాడు.

ఇది కూడా చదవండి: బిగ్‌బాస్-5 లాంచింగ్ డేట్ ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement