Tuesday, November 19, 2024

Aman Sehrawat | ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్‌లో అమ‌న్ రికార్డ్ !

తన తొలి ఒలింపిక్స్ లోనే భారత్ కు పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్… మరో ఫీట్ సాధించాడు. 21 ఏళ్ల సెహ్రావత్…. పారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించిన అతిపిన్న వయస్కుడు. కాగా, 57 కేజీల రెజ్లింగ్ క్యాటగిరీలో కుస్తీ చేసే అమన్ సెహ్రావత్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 2 స్థానానికి ఎదిగాడు. ఒలిపిక్స్ కు ముందు రెజ్లింగ్ 57 కేజీల క్యాటగిరీ ప్రపంచ ర్యాంకింగ్స్ అమన్ 6వ స్థానంలో ఉన్నాడు.

ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ పోటీలో 57 కేజీల విభాగంలో ప్యూర్టో రికోకు చెందిన డేరియన్ టాయ్ క్రూజ్‌పై అమన్ 13-5 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయంతో ప్రపంచ రెజ్లింగ్ పాయింట్ల పట్టికలో అమన్ సెహ్రావత్ 51,600 పాయింట్లు సాధించాడు. దాంతో అతను రెండో స్పాట్ కు ఎదిగాడు. ప్రపంచ రెజ్లింగ్ 57 కేజీ క్యాటగిరీలో ప్రస్తుతం.. జపాన్ కు చెందిన రెయ్ హిగూచీ టాప్ ర్యాంక్ లో సాధించాడు. అతను 59 వేల పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement