టీమిండియాకు ఆసియా కప్‌తో పాటు ప్రపంచ కప్ అందించడమే తన ముందు ఉన్న లక్ష్యం అని టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇదే తనకు ప్రస్తుతం ప్రేరణ ఇచ్చే అంశం అని అభిప్రాయ పడ్డాడు. ఈ కప్‌లు సాధించేందుకు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టు వివరించాడు. అయితే కొంత నిలకడగా ఆడలేకపోతున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే కొంత విరామం కూడా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపాడు.
ఒక్కసారి రాణిస్తే.. మళ్లి వెనక్కిమళ్లి చూసుకునే అవకాశం ఇవ్వనన్నాడు. గత టీ20 ప్రపంచ కప్ తరువాత.. విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించింది. రెండేళ్లుగా ఫామ్ లేమితో విరాట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తాజా ఐపీఎల్‌లోనూ అంతగా ఆకట్టుకోలేకపోయాడు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..