Friday, September 20, 2024

Paris Olympics | ఆమెలో “అతడి” పవర్!

పారిస్ ఒలింపిక్స్ 2024లో దారుణం చోటు చేసుకుంది. మహిళల బాక్సింగ్ పోటీల్లో ఇటలీ బాక్సర్‌కు తీరని అన్యాయం జరిగింది. లింగ నిర్దారణ పరీక్షలో విఫలమైన అల్జీరియాకు చెందిన బాక్సర్‌ ఇమేన్ ఖెలిఫ్‌కు ఒలింపిక్స్ నిర్వాహకులు అనుమతిచ్చారు.
దాంతో ఇటలీ బాక్సర్ ఏంజెలా కారి తీవ్రంగా గాయపడింది.

46 సెకన్లలోనే మ్యాచ్‌ను ముగించిన అల్జీరియా.. ఏంజెలా కారిని బౌట్ నుంచి నిష్క్రమించేలా బెంబేలెత్తించింది. దాంతో ఒలింపిక్స్ నిర్వాహకులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురువారం జరిగిన మహిళల బాక్సింగ్ 66 కేజీల ప్రిలిమినరీ రౌండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖెలిఫ్ పిడిగుద్దలతో దాడి చేయడంతో ఏంజెలా ముక్కు పలిగేంత పనైంది.

రెండు సార్లు ఆమె హెడ్ సేఫ్టీ తొలిగిపోయింది. ఖెలిఫ్ పంచ్ పవర్‌కు భయపడి ఏంజెలా బౌట్ నుంచి నిష్క్రమించింది. ఖెలిఫ్ రెండు సార్లు ఏంజెలా తల భాగంపై అటాక్ చేసింది. ముక్కులో తీవ్ర నొప్పి రావడంతోనే బౌట్ నుంచి వైదొలిగినట్లు ఏంజెలా పేర్కొంది. మ్యాచ్ అనంతరం ఖెలిఫ్‌కు కరాచాలనం కూడా చేయలేదు.

లింగ నిర్దారణ పరీక్షలో విఫలమైన ఖెలిఫ్‌ను గతేడాది జరిగిన బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అనుమతించలేదు. ఖెలిఫ్ మహిళ కాదని, మగ లక్షణాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదాల మధ్యే ఆమె ఒలింపిక్స్‌లో బరిలోకి దిగింది. అయితే ఖెలిఫ్‌తో పాటు ఒలింపిక్స్ నిర్వాహకులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement