Tuesday, November 26, 2024

IPL | పంజాబ్‌కు షాక్‌…. గాయంతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెత్త ప్రదర్శనలతో ప్లే ఆఫ్స్‌ రేస్‌ నుంచి ఇప్పటికే తప్పుకున్న పంజాబ్‌ కింగ్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఇంగ్లండ్‌కు చెందిన లియమ్‌ లివింగ్‌స్టోన్‌ గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో సతమవుతున్న స్టోన్‌ తిరిగి ఇంగ్లండ్‌కు ప్రయాణం కానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ఐపీఎల్‌లో దాదాపు ముగిసింది. త్వరలో టీ20 వరల్డ్‌కప్‌ మొదలు కానుంది.

- Advertisement -

అప్పటివరకూ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఐపీఎల్‌ ఈసారి నాకు కలిసిరాలేదు. అయినా తనకు అండగా నిలిచిన పంజాబ్‌ అభిమానులకు ధన్యావాదాలు. ఐపీఎల్‌లో ప్రతి క్షణాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను అని లివింగ్‌స్టోన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. కాగా సీజన్‌లో ఘోరంగా విఫలమైన స్టోన్‌ 7 మ్యాచుల్లో 22.20 సగటుతో 111 పరుగులే చేశాడు. మరోవైపు 3 వికెట్లే తీయగలిగాడు. అయితే టీ20 ప్రపంచకప్‌-2024 కోసం ఇంగ్లండ్‌ ప్రకటించిన జట్టులో లివింగ్‌స్టోన్‌ చోటు దక్కించుకున్నాడు.

వరల్డ్‌కప్‌ జట్టులో భాగమైన ఆటగాళ్లు స్వదేశానికి తిరిగివచ్చేయాలని ఇంగ్లండ్‌ అండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. దాంతో ప్రస్తుతం ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడుతున్న పంజాబ్‌కే చెందిన కెప్టెన్‌ సామ్‌ కర్రాన్‌, బెయిర్‌ స్టో, మొయిన్‌ అలీ (సీఎస్‌కే), విల్‌ జాక్స్‌ (బెంగళూరు), ఫిల్‌ సాల్ట్‌ (కోల్‌కతా), రీస్‌ టాప్లే (బెంగళూరు), జోస్‌ బట్లర్‌ (రాజస్తాన్‌) కూడా త్వరలోనే ఇంగ్లండ్‌కు ప్రయణం కానున్నట్లు సమాచారం. ఇక ఈసీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ 4 విజయాలు మాత్రమే సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement