సౌతాఫ్రికా ప్లేయర్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ కి భారత్లో ఉన్న ఫ్యాన్ ఫ్యాలోయింగ్ వేరే లెవల్లో ఉంటుంది. ఏబీడీ ఆటను ప్రాణపదంగా ప్రేమించే అభిమానులు ఇక్కడ చాలా మందే ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లకు ఉన్నంతటి క్రేజ్ అతడికి కూడా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాడు. కెప్టెన్ కూల్ ధోని, టీమిండియా సారథి కోహ్లి, హిట్మ్యాన్ రోహిత్ శర్మ మాదిరిగానే, ఏబీ డివిలియర్స్ మైదానంలో అడుగు పెడితే చాలు హర్షధ్వానాల మోతతో గ్రౌండ్ దద్దరిల్లిపోతుందంటూ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. 2015.. ధర్మశాల.. సాధారణంగా ధోని, కోహ్లి, రోహిత్ వస్తుంటే ప్రేక్షకులు కేకలు వేస్తారు. సంతోషంతో అరుస్తారు. అచ్చం అలాగే ఏబీ డివిలియర్స్ రాగానే.. అంతా లేచి నిలబడ్డారు. తనని కూడా వారిలో ఒకడి(భారత ఆటగాడు)గానే భావించారు. నేను ఆ విషయం ఎప్పటికీ మర్చిపోను’’ అని పేర్కొన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement