Saturday, November 16, 2024

T20 World Cup | కేఎల్ రాహుల్ ను అందుకే ఎంపిక చేయలేదు : అజిత్ అగార్క‌ర్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతొంది. ఈ క్ర‌మంలో ఈ మెగాటోర్నీలో పాల్గొనే జ‌ట్ల వివ‌రాల‌ను ఇప్ప‌టికే ఆయా క్రికెట్ బోర్డులు వెల్ల‌డించాయి. తాజాగా, బీసీసీఐ సైతం రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో… 15 మంది సభ్యుల బృందంతో పాటు న‌లుగురు ఆట‌గాళ్లు రిజ‌ర్వ్ ప్లేయ‌ర్లుగా ఎంపిక చేస్తూ భార‌త ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ప‌లు కీల‌క ఇన్నింగ్స్ లు ఆడిన కేఎల్ రాహుల్ కు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అయితే.. కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయ‌లేదు అన్న విష‌యాన్ని చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ వెల్ల‌డించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్‌లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడ‌ని.. మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడే వికెట్ కీప‌ర్‌ను తీసుకోవాల‌న్న ఉద్దేశ్యంతోనే కేఎల్ రాహుల్‌ను టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేయ‌లేద‌ని అగార్క‌ర్ చెప్పారు. కేఎల్ రాహుల్ కంటే త‌మ‌కు సంజూ శాంస‌న్, రిశ‌బ్ పంత్ బెస్ట్ ఆప్ష‌న్‌గా క‌నిపించాడ‌ని అన్నారు.

జ‌ట్టు అవ‌స‌రాల దృష్ట్యా మిడిల్ ఆర్డ‌ర్‌లో ఆడే వికెట్ కీప‌ర్ కావాల్సి ఉంది. అందుకే రిష‌బ్ పంత్‌, సంజూ శాంస‌న్‌ల‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు తెలిపాడు. అంతేకాకుండా బ్యాటింగ్ లైన‌ప్‌లో శాంస‌న్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డ‌ని చెప్పారు. ‘‘ప్లేయ‌ర్ ఎవ‌రు అన్న‌ది మేము చూడ‌లేదు. మాకు కావాల్సిన ఆప్ష‌న్స్‌ను మాత్ర‌మే తీసుకున్నాం’’ అని అజిత్ అగార్క‌ర్ తెలిపాడు. అదే స‌మ‌యంలో ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జ‌ట్టును ఎంపిక చేయ‌లేద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాడు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ భార‌త జ‌ట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్.

- Advertisement -

రిజర్వ్ ప్లేయర్లు : శుభ్ మన్ గిల్, రింకూసింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్ ల‌ను ఎంపిక చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement