ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఓపెన్ లో వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ అన్ సె యంగ్ (సౌత్ కొరియా) టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో 19-21, 0-3 తేడాతో జియా మిన్ యో (సింగపూర్) చేతిలో ఓడింది. ఇండియా ఈ టోర్నీలో వరుస విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన యంగ్.. మూడో రౌండ్‌లో మోకాలి గాయం కారణంగా సెట్‌తో పాటు టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
తొలి సెట్‌లో హోరాహోరిగా పోరాడినా రెండు పాయింట్ల తేడాతో సెట్ కోల్పోయిన యంగ్.. రెండో సెట్‌లో మోకాలికి కట్టు కట్టుకుని మరీ ఆడింది. అయితే రెండో సెట్ మొదలయ్యాక యంగ్ నొప్పిని భరించలేక రిటైర్డ్ హర్ట్ గా తప్పుకుంది. దీంతో మిన్ విజేతగా నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో పారిస్ ఒలింపిక్స్ జరగాల్సి ఉండగా అప్పటివరకూ పూర్తిస్థాయిలో కోలుకోవాలని భావిస్తోంది. ఇక క్వార్టర్స్‌లో గెలిచిన మిన్.. సెమీస్‌లో చైనాకు చెందిన ఆరో సీడ్ తై జూ యింగ్‌తో తలపడనుంది.