Monday, November 25, 2024

T20 | భార‌త పేస‌ర్ల దూకుడు.. త‌క్కువ స్కోరుకే ఐర్లండ్ ఆలౌట్‌

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి మ్యాచ్‌లో భార‌త పేస‌ర్లు ప్ర‌తాపం చూపించారు. న్యూయార్క్ స్టేడియంలో ప‌సికూన‌ ఐర్లాండ్‌vబ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. బౌన్స్, స్లో బాల్‌తో హార్దిక్ పాండ్యా(3/27), అర్ష్‌దీప్ సింగ్(2/34), జ‌స్ప్రీత్ బుమ్రా(2/6)ల విజృంభించ‌గా ఐరిష్ బ్యాట‌ర్లు డ‌గౌట్‌కు క్యూ క‌ట్టారు. దాంతో ఐరిష్ జ‌ట్టు 96 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది. గెరాత్ డెలానీ(26), జోష్ లిటిల్(14)లు టాప్ స్కోర‌ర్లుగా నిలిచాడు.

టాస్ గెలిచిన రోహిత్ ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అంతే.. బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై భార‌త యువ లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌దీప్ సింగ్ తొలి బ్రేక్ ఇచ్చాడు. ఒకే ఓవ‌ర్లో డేంజ‌ర‌స్ పాల్ స్టిర్లింగ్(2)ను వెన‌క్కి పంపిన అత‌డు ఆఖ‌రి బంతికి మ‌రో ఓపెన‌ర్ అండ్రూ బ‌ల్బిరినీ(2)ని బౌల్డ్ చేశాడు. దాంతో, 9 ప‌రుగులకే ఐర్లాండ్ ఓపెన‌ర్లు పెవిలియ‌న్ చేరారు. ఆ త‌ర్వాత బంతి అందుకున్న పాండ్యా రెండు వికెట్ల‌తో ఐర్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. సిరాజ్, బుమ్రా సైతం తలొక వికెట్ తీయ‌డంతో ఒక‌ద‌శ‌లో ఐర్లాండ్ 60 లోపై ఆలౌట్ అవుతుంద‌నిపించింది.

డెలానీ ఒంట‌రి పోరాటం

యాభై ప‌రుగుల‌కే 8 వికెట్లు ప‌డిన ఐర్లాండ్ పోరాడ‌గ‌లిగే స్కోర్ చేసిందంటే అందుకు కార‌ణం గెరాత్ డెలానీ(26), జోష్ లిటిల్(14). వీళ్లిద్ద‌రూ ధ‌నాధ‌న్ ఆడి తొమ్మిదో వికెట్‌కు 27 ర‌న్స్ జోడించారు. యార్క‌ర్‌తో విడ‌దీసిన బుమ్రా రోహిత్ సేన‌కు రిలీఫ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన బెంజ‌మిన్ వైట్(2) జ‌తగా డెలానీ రెచ్చిపోయాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవ‌ర్లో ఫోర్, సిక్స్‌, ఫోర్ బాది జ‌ట్టు స్కోర్ 90 దాటించాడు. అయితే.. ఆదే ఓవ‌ర్లో నో బాల్ త‌ర్వాత రెండు ర‌న్స్ తీసే క్ర‌మంలో డెలానీ ర‌నౌట‌య్యాడు. దాంతో, 96 ప‌రుగుల‌కే ఐర్లాండ్ ప‌రిమిత‌మైంది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement