Tuesday, November 26, 2024

దూకుడు పెంచిన రోహిత్.. తన ఖాతాలో మరో అరుదైన రికార్డు..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అరుదైన రికార్డును చేరుకున్నాడు. మొదటి టెస్టులో సెంచరీ, రెండో టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్‌ సెంచరీలు బాదాడు. ఈ క్రమంలో టెస్టుల్లో వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో డబుల్‌ డిజిట్‌ స్కోరు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదివరకు ఈ రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనె పేరిట ఉండేది.

అతడు వరుసగా 29 ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రోహిత్‌ శర్మ డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఆసీస్‌తో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సహా గత 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 12, 161, 26, 66, 25లి, 49, 34, 30, 36, 12లి, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 15, 46, 120, 32, 12, 12, 35, 15, 43, 103, 80, 57 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఐదు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement