కొలంబియాలోని కాలిలో జరుగుతున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి అగసార నందిని సెమీఫైనల్స్‌కు చేరింది. 100మీ. హర్డిల్స్ పరుగును ఆమె 13.58 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన 13.70 సెకన్లుగా ఉంది. హీట్స్‌లో మూడో స్థానంలో నిలవడంతో నందిని సెమీస్‌కు అర్హత సాధించింది. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత అథ్లెట్ ఉన్నతి అయ్యప్ప 36వ స్థానంలో నిలిచి నిష్క్రమించింది. గత ఏడాది జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా నందిని సెమీస్ చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో 14.16 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన ఆమె ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement