Monday, November 18, 2024

త్వరలో ఆఫ్రో- ఆసియా కప్‌! ఆసియా జట్టులో కోహ్లీ- బాబర్‌, బుమ్రా- అఫ్రిది..

ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ”ఆఫ్రో- ఆసియా క్రికెట్‌ కప్‌” టోర్నమెంట్‌ను పున:ప్రారంభించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) కసరత్తు చేస్తోంది. ఆసియా, ఆఫ్రికా దేశాల క్రికెట్‌ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకునేలా ఏసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. వివిధ కారణాల చేత 2007లో ఆఫ్రో-ఆసియా క్రికెట్‌ కప్‌ టోర్నీ నిలిచిపోయింది. తాజాగా ఏసీసీ ఈ టోర్నీని తిరిని నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా బీసీసీఐ, పీసీబీ, తదితర క్రికెట్‌ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏసీసీ కమర్షిల్‌ అండ్‌ ఈవెంట్స్‌ హెడ్‌ ప్రభాకరన్‌ తన్రాజ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం… టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే… మిగతా దేశాల క్రికెట్‌ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఏసీసీ ప్రతిపాదనకు బీసీసీఐ ఓకే చెబితే, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, బాబర్‌ అజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, షాహిద్‌ అఫ్రిది లాంటి ప్రపంచ స్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు.


ఈ టోర్నీ 2005లో తొలిసారి జరగ్గా, ఆసియా జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్‌, షాహిద్‌ అఫ్రిది, సనత్‌ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ప్రాతినిథ్యం వహించారు. గ్రేమ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌, జాక్‌ కలిస్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున బరిలోకి దిగారు. ఆసియా ఎలెవన్‌ తరఫున భారత్‌, పాక్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఆడగా… ఆఫ్రికా ఎలెవెన్‌ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు బరిలోకి దిగారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement