టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం ట్రిండాడ్ వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పపువా 19.5 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. కిప్లిన్ (27) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. గుల్బాదిన్ నైబ్ (49 నాటౌట్) దూకుడుగా ఆడాడు. ఈ విజయంతో ఆరు పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది అఫ్గానిస్థాన్. వెస్టిండీస్ కూడా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు ఆడిన మూడింట్లో నెగ్గాయి.
దీంతో న్యూజిలాండ్‌కు గ్రూప్-సీలో టాప్‌లో నిలిచే దారులు మూసుకుపోయాయి. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్-8 ఆశలు ఆవిరయ్యాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మొదటి రౌండ్లోనే వెనుదిరడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి.