టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ రేసు ముగిసింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. అంతకు ముందు గ్రూప్ 2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ లో అడుగుపెట్టాయి… ఇక నేడు జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత అందుకుంది.
వరల్డ్ కప్ చరిత్రలో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. అయితే అఫ్గానిస్థాన్ – బంగ్లాదేశ్ మధ్య పోరు హోరాహోరీగా సాగడంతో ఓ దశలో ఆస్ట్రేలియా సెమీస్‌కు క్వాలిఫై అయ్యేలా పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓటమిపాలైతే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఓ దశలో బంగ్లాదేశ్ విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. దీంతో అఫ్గానిస్థాన్ ఆటకు కావాలనే ఆటంకం కలిగించింది. ఆటను ఆలస్యంగా ప్రారంభించాలని, వరుణుడు ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావాలని ట్రై చేసింది. ఎందుకంటే ఆ సమయంలో డక్‌వర్త్‌లూయిస్ పద్ధతితో బంగ్లాదేశ్ రెండు పరుగుల వెనుకంజలో ఉంది.
11.4 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 81/7. బంగ్లా విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరం. అయితే ఆ సమయంలో తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. అప్పటికే వరుణుడు చాలా సార్లు ఆటకు ఆటంకం కలిగించాడు. మరోసారి మ్యాచ్‌ను ఆపేస్తే కచ్చితంగా ఓవర్లను తగ్గించి మ్యాచ్‌ను కుదిస్తారు. ఇది అఫ్గానిస్థాన్‌కు లాభంగా మారుతుంది. దీంతో అఫ్గానిస్థాన్ కోచ్ జొనాతన్ ట్రోట్ మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సిగ్నల్ పంపాడు. మ్యాచ్‌ను స్లో చేయమని సూచించాడు.
దీంతో స్లిప్‌లో ఉన్న గుల్బాదిన్ నైబ్ తొడకండరాల పట్టేశాయని మైదానంలో పడిపోయాడు. కావాలనే చేస్తున్నాడని అంపైర్లుకు తెలిసినా ఏం చేయలేకపోయారు. మరోవైపు వరుణుడు కాస్త పుంజుకున్నాడు. దీంతో అంపైర్లు కవర్లను తెప్పించారు. పది నిమిషాలకే మ్యాచ్ తిరిగి ఫ్రారంభమైనప్పటికీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లా లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
అంటే ఓ ఓవర్‌ను తగ్గించి బంగ్లా టార్గెట్‌ను ఒక్క పరుగు తగ్గించారు. ఇది అఫ్గానిస్థాన్‌కు అదృష్టంగా మారింది. మరోవైపు ఇది బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫలితంగా మ్యాచ్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. వ్యూహత్మకంగానే వ్యవహరించి గెలుపు సాధించి అప్ఘనిస్థాన్ తొలిసారి సెమీస్ లోకి అడుగెపెట్టింది…