క్రికెటర్ ధోనీ అంటే చాలా మందికి ఇష్టంతో పాటు ప్రాణం కూడా.. ధోనీకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఓ అభిమాని ధోని పట్ల తనకున్న వీరాభిమానాన్ని భిన్నంగా చాటుకున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లా తమ్నార్ తాలూకా పరిధిలో ఉన్న, కొక్కెల్ గ్రామ వాసి దీపక్ పటేల్ కు ధోనీ అంటే ఎంతో అభిమానం. అతడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ధోనీ పట్ల తనకు ఎంత అభిమానం ఉన్నదీ పది మందికి తెలియజెప్పాలని అనుకున్నాడు. పెళ్లి శుభలేఖ రెండు వైపులా ధోనీ ఫొటో ముద్రించాడు. ధోనీ జెర్సీ నంబర్ 7ను కూడా వేయించాడు. తల అని కూడా రాయించాడు. ధోనీని తమిళులు తల (నాయకుడు) అని పిలుచుకుంటారు. దీపక్ పటేల్ చిన్నప్పటి నుంచి క్రికెట్ ప్రేమికుడు. గ్రామంలో క్రికెట్ జట్టుకు కెప్టెన్ కూడా. దీంతో సహజంగానే ధోనీ అంటే అభిమానం ఏర్పడి, అది మరింత బలపడింది. ధోనీ కెప్టెన్సీ స్ట్రాటజీని ఉపయోగించి తాను కూడా ఎన్నో మ్యాచుల్లో గెలిచానని అతడు చెబుతుంటాడు. ధోనీ అంటే కేవలం అభిమానంతో సరిపెట్టకుండా, ధోనీ అడుగు జాడల్లో నడుస్తున్నాడట.
ధోనీపై అభిమానం.. వెడ్డింగ్ కార్డులో క్రికెటర్ ఫొటో
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement