Tuesday, November 19, 2024

శ్రీలంక ముందు 447 పరుగుల భారీ టార్గేట్

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 303/9 దగ్గర డిక్లేర్డ్‌ చేసింది. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది. ఇవాళ ఆట ఆరంభంలోనే శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే పరిమితం చేసింది టీమిండియా… ఆపై రెండో ఇన్నింగ్స్ ను ఉత్సాహంగా ఆరంభించింది. రిషబ్ పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ క్రమంలో భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేసి క‌పిల్ 40ఏళ్ల రికార్డ్ ని బ‌ద్ద‌ల కొట్టాడు పంత్. పంత్ స్కోరులో 7 ఫోర్లు, 2 సిక్సులున్నాయి.

శ్రేయర్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయ్యర్ 87 బంతుల్లో 67 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కాగా, భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన లంకకు మొదటి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. తిరుమనె (0) డకౌటయ్యాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement