Friday, November 8, 2024

ఒక రోజు ముందుగానే ఫుట్‌బాల్‌ మెగా టోర్నీ.. నవంబర్‌ 21న కాదు 20న ప్రారంభం

ముంబై: ఖతార్‌ వేదికగా నవంబర్‌ 21 నుంచి ప్రారంభం కావాల్సిన ఫిఫా వరల్డ్‌ కప్‌ టోర్న మెంట్‌ ఒక ముందుగానే ఆరంభం కానుంది. ఈ మేరకు ఫిఫా అధికారికంగా ప్రకటించింది. ఫిఫా వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌లో మార్పు రావడం చాలా అరుదు. పాత షెడ్యూల్‌లో భాగంగా నవంబర్‌ 21న ఈక్వెడార్‌తో ఖతార్‌ అధికారిక ప్రారంభ మ్యాచ్‌ ఉండాల్సి ఉంది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం 20వ తేదీన సెనెగల్‌తో నెదర్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. టోర్నీ ప్రారంభ తేదీలో మార్పు జరగడంతో ఆరంభ వేడుకలను కూడా ఒక రోజు ముందుగా నిర్వహిస్తారు. ఫిఫా వరల్డ్‌ కప్‌ మెగా టోర్నీ వస్తుందంటే ఫుట్‌బాల్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.

నాలుగేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో అత్యుత్తమ పోటీ ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరిస్తుంది. వరల్డ్‌ కప్‌ తేదీ ఖరారు కాగానే టోర్నీ జరిగే దేశానికి వెళ్లేందుకు అభిమానులు ప్లాన్‌ చేసుకుంటారు. విమాన టికెట్లు, హాటల్‌ రూమ్స్‌ బుక్‌ చేసుకుంటారు. అయితే ఈసారి వాళ్లు తమ ప్లాన్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఖతార్‌ వేదికగా జరగాల్సిన ఫిఫా వరల్డ్‌ కప్‌ ఒక రోజు ముందే మొదలవనుంది. మారిన తేదీలకు తగ్గట్టు ఖతార్‌ రావాలనుకుంటున్న సాకర్‌ అభిమానులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement