Saturday, November 30, 2024

IND vs NZ | మూడో టెస్టులో ఆ ఆటగాడికి ఛాన్స్ !

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి సిరిస్ ను చేజార్చుకున్న టీమిండియా.. క‌నీసం మూడో టెస్టులో గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని చూస్తొంది. నవంబర్ 1 (శుక్రవారం) నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

అయితే, సిరీస్ చేజారిన‌ప్ప‌టికీ… డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి టీమిండియా ప్రయత్నిస్తోంది. ముంబై టెస్ట్‌లో విజయం సాధించి క్లీన్ స్వీప్ తప్పించుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ అగ్రస్థానాన్ని కాపాడుకోవాలనుకుంటోంది.

ఈ క్ర‌మంలో మూడో టెస్టు జ‌ట్టులో కీల‌క మార్పులు చేసిన‌ట్లు తెలుస్తొంది. టీమిండియా యువ పేసర్, కేకేఆర్ సెన్సేషన్ హర్షిత్ రాణాను భారత జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న హర్షిత్ రాణా.. అస్సాంతో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

బౌలింగ్‌లో 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రదర్శనతో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ అసాధారణ ప్రదర్శనతో ఈ గంభీర్ శిష్యుడిని భారత సెలెక్టర్లు న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ఎంపిక చేసినట్లు సమాచారం. బుధవారం అతను భారత జట్టుతో కలిసే అవకాశం ఉంది.

ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఈ పర్యటన నేపథ్యంలోనే అతన్ని న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్‌కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముంబై టెస్ట్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌తోనే హర్షిత్ రాణా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.

- Advertisement -

కాగా, ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్‌.. క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 107 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement